కరకట్ట తెగే ప్రమాదముంది ... రక్షణ చర్యలు చేపట్టండి
- భద్రాచలంలో దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిన కెచ్చెల
- తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్
భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట తెగి పోయే ప్రమాదం వుందని, వెంటనే అధికార్లు మరమత్తులు
చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపధ్యంలో శుక్రవారం ఆయన పార్టీ భద్రాచలండివిజన్ నాయకులు దాసరి సాయి, మునిగేలా శివ ప్రశాంత్, భాస్కర్, బుర్ర నారాయణతో కలిసి దెబ్బతిన్న
కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ గోదావరి ఉత్తరం
వైపు కరకట్ట మధ్యలో గోడలు కూలి పోయాయని, పలు చోట్ల భీటలు వారాయని, కట్టకు పేర్చిన రాళ్ళు కూడా క్రుంగి
పోయాయని తెలిపారు. ఇప్పటికే కట్ట దెబ్బ తిన్న ప్రాంతంలో నీరు లీకవుతోందని చెప్పారు.
వరద ఉధృతి ఎక్కువైతే కట్ట తెగి పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికార్లు
మరమత్తులు చేయాలని, ముంపు
ప్రాంత ప్రజల పునరావాసానికి ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా
అశోక్ నగర్ కాలనీ, ఎటపాక
గ్రామ ప్రజలకు ఆస్తి, ప్రాణ
నష్టం జరగకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో జరగపోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత
వహించాలని రంగారెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.


Comments
Post a Comment